Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆన్సర్ షీట్ నిండా బూతులు, హీరోయిన్ల ప్రేమ కలాపాలు... ఇలా పరీక్ష రాసి పాసైన విద్యార్థి ఇతనేనేమో!

  • హీరోయిన్ల ప్రేమ కలాపాలు, పోర్నోగ్రఫీ
  • ఆన్సర్ షీట్ ను చూడనైనా చూడకుండా మార్కులు
  • పేపర్ దిద్దిన లెక్చరర్ పై రూ. 1000 జరిమానా
ప్రశ్నాపత్రాల్లో ఏం రాసైనా పాస్ కావచ్చని, రాసిందేంటో చూడకుండా మార్కులు వేసే అధ్యాపకులు కూడా ఉంటారని నిరూపించాడో విద్యార్థి. గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన ఇంటర్ విద్యార్థి ఎకనామిక్స్ పేపర్ లో అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తనకు వచ్చిన బూతులు, ఐశ్వర్యా రాయ్, రాణీ ముఖర్జీ ప్రేమ కలాపాలు, పోర్నోగ్రఫీ అంశాలతో నింపేశాడు. పేజీలకు పేజీలు రాసేశాడు. అతను ఏం రాశాడన్న విషయాన్ని ఎంతమాత్రమూ పరిశీలించని, పేపర్లు దిద్దిన టీచర్, 36 మార్కులేసి పాస్ చేసేశాడు.

ఇక ఈ విషయం మోడరేటర్ కంట పడింది. విద్యలో నాణ్యతను దెబ్బతీసేలా ప్రవర్తించి, జవాబు పత్రాన్ని పూర్తిగా పరిశీలించని టీచర్ కు రూ. 1000 జరిమానా విధించడంతో పాటు, సమాధానాలను మరోసారి పరిశీలించి, వేసిన మార్కుల్లో 22 తగ్గించి, 14 మార్కులతో సరిపెట్టారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీచర్లు చాలా మందే ఉన్నారని, ఈ సంవత్సరం ఇంటర్ ఆన్సర్ షీట్లను సరిగ్గా దిద్దని వారి నుంచి రూ. 10 లక్షలు జరిమానాగా వసూలు చేసినట్టు గుజరాత్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వైస్ చైర్మన్ ఆర్ ఆర్ ఠక్కర్ వెల్లడించారు.
inter
gujarath
marks

More Telugu News