సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • ఈ నెల 25 నుంచి తెలుగు 'క్వీన్' షూటింగ్ 
  • ఫ్యామిలీతో కలసి ఎన్టీఆర్ యూరప్ పర్యటన 
  • రఘు కుంచె నిర్మాణంలో '47 రోజులు'
  • నాగశౌర్య మరో ప్రేమకథా చిత్రం
*  తమన్నా కథానాయికగా నటించే 'క్వీన్' తెలుగు రీమేక్ షూటింగును ఈ నెల 25న ప్రారంభిస్తున్నారు. నీలకంఠ దర్శకత్వంలో ఈ తెలుగు వెర్షన్ ని మనుకుమరన్ నిర్మిస్తున్నారు. ఇక తమిళ 'క్వీన్' వెర్షన్ లో కాజల్ అగర్వాల్ నాయికగా నటిస్తోంది.    
*  నిన్నటి వరకు 'జై లవ కుశ' చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీబిజీగా పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ విశ్రాంతి కోసం యూరప్ వెళుతున్నాడు. ఫ్యామిలీతో కలసి యూరప్ లోని పలు దేశాలను ఆయన చుట్టివస్తాడు.
*  గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె నిర్మాతగా మారి నిర్మిస్తున్న చిత్రానికి '47 డేస్' అనే టైటిల్ని నిర్ణయించారు. ఇందులో 'ఘాజి' ఫేం సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తుండగా, పూజా ఝవేరి నాయికగా నటిస్తోంది. పూరీ వద్ద పనిచేసిన ప్రదీప్ మద్దాలి దీని ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.  
*  యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడుగా మరో ఓ ప్రేమకథా చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరాం దర్శకత్వం వహిస్తాడు. డిసెంబర్ నుంచి ఈ చిత్రం షూటింగ్ జరుగుతుందని నిర్మాత తెలిపారు.  
Tamanna
Kajal

More Telugu News