Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

  • శ్రుతిహాసన్ కి కాబోయేవాడు అలా ఉండాలట! 
  • మరో రెండు సినిమాలు ఒప్పుకున్న శర్వానంద్ 
  • స్విట్జర్లాండులో సప్తగిరి డ్యూయెట్లు 
  • వచ్చే నెల నుంచి చైతూ 'సవ్యసాచి'
*  తనకు కాబోయే భర్తకు కాస్త గెడ్డం వుండాలంటోంది ప్రెట్టీ డాల్ శ్రుతి హాసన్. "క్లీన్ షేవ్ చేసుకునే మగాళ్లంటే నాకు ఇష్టం వుండదు. గెడ్డం ఉంటేనే మేన్లీగా కనిపిస్తారు. అలాంటి వాడే భర్తగా రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.    
*  తాజాగా 'మహానుభావుడు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో శర్వానంద్ త్వరలో మరో రెండు చిత్రాలను చేయనున్నాడు. వీటిలో ఒక దానికి సుధీర్ వర్మ, మరో చిత్రానికి ప్రకాశ్ దర్శకత్వం వహిస్తారని శర్వానంద్ తెలిపాడు. ప్రస్తుతం ఇవి ప్రీ ప్రొడక్షన్ దశలో వున్నాయని అన్నాడు.
*  హాస్య నటుడు సప్తగిరి కథానాయకుడుగా నటిస్తున్న 'సప్తగిరి ఎల్.ఎల్.బి' చిత్రం పాటల చిత్రీకరణ ప్రస్తుతం స్విట్జర్లాండులో జరుగుతోంది. ఈ నెల 22న మొదలైన ఈ షూటింగ్ వచ్చే నెల 5 వరకు అక్కడ జరుగుతుంది.  
*  చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటించే 'సవ్యసాచి' చిత్రం షూటింగ్ వచ్చే నెల 16 నుంచి జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది.  
Shruti
shrwa

More Telugu News