‘జై’ పాత్ర అద్భుతమంటూ రామ్ చరణ్ ప్రశంసలు.. ఫొటోకు పోజిచ్చిన జూనియర్ ఎన్టీఆర్- చెర్రీ !
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘జై’ పాత్ర అద్భుతమంటూ రామ్ చరణ్ ప్రశంసలు.. ఫొటోకు పోజిచ్చిన జూనియర్ ఎన్టీఆర్- చెర్రీ !

  • మూడు పాత్రలు అదరగొట్టేశాడన్న చరణ్
  • ‘విక్టరీ’ సింబల్ చూపించిన తారక్, చెర్రీ 
  • ఫొటో పోస్ట్ చేసిన కోన వెంకట్
‘జై లవ కుశ’ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నటనకు, ముఖ్యంగా ‘జై’ పాత్రను విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చూశాడు. ఈ చిత్రంలో మూడు పాత్రల్లో అదరగొట్టేశావంటూ జూనియర్ ఎన్టీఆర్ కు రామ్ చరణ్ చెప్పాడట. ‘జై’ పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని తారక్ కు చెర్రీ చెప్పినట్టు సమాచారం.

కాగా, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఆప్యాయంగా కలిసి, ‘విక్టరీ’ సింబల్ చూపిస్తూ నిలబడి పోజిస్తున్న ఫొటోను ప్రముఖ రచయిత కోన వెంకట్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో ఆయన కూడా ఉన్నారు. ‘‘జై లవ కుశ’ సినిమాను చూసిన అనంతరం, ‘జై’ తో రామ్ చరణ్ వేడుక...థ్యాంక్యూ’ అని కోన వెంకట్ పేర్కొన్నారు.
జూనియర్ ఎన్టీఆర్
రామ్ చరణ్

More Telugu News