Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హ్యాపీ బర్త్ డే చిన్నొదినా..!: అల్లు శిరీష్

  • అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి పుట్టిన రోజు
  • కేక్ కట్ చేసిన స్నేహా
  • శుభాకాంక్షలు తెలిపిన అల్లు శిరీష్
ఈ రోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి పుట్టిన రోజ‌న్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఊటీలో సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్న బన్నీ త‌న భార్య‌ను మిస్ అవుతున్నాన‌ని పేర్కొంటూ ఆమెకు హ్యాపీ బ‌ర్త్ డే చెప్పాడు. ఈ రోజు మ‌ధ్యాహ్నం స్నేహా రెడ్డి తమ ఇంట్లో పుట్టిన‌రోజు కేక్ ను కోసింది. ఈ సంద‌ర్భంగా తీసిన ఫొటోను అల్లు శిరీష్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ‘హ్యాపీ బ‌ర్త్ డే చిన్నొదిన స్నేహా’ అని పేర్కొన్నాడు.

త‌న పిల్ల‌లు, అత్త‌మామ‌ల స‌మ‌క్షంలో స్నేహా రెడ్డి కేక్ క‌ట్ చేసి పుట్టిన రోజును జ‌రుపుకుంది. ప్రస్తుతం బన్నీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో నటిస్తున్న నేప‌థ్యంలో ఈ వేడుక‌లో పాల్గొన‌లేదు.  
allu family

More Telugu News