బ‌తుక‌మ్మతో ఊరూ వాడ‌ల‌ను భ‌క్తి పార‌వ‌శ్యంతో ముంచెత్తిన ఆడ‌ప‌డుచుల‌కు శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ‌తుక‌మ్మతో ఊరూ వాడ‌ల‌ను భ‌క్తి పార‌వ‌శ్యంతో ముంచెత్తిన ఆడ‌ప‌డుచుల‌కు శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

  • ద‌స‌రా పండుగ శుభాకాంక్షలు చెప్పిన జనసేనాని
  • పార్టీ కార్యక్రమాలు, సినిమాలతో బిజీబిజీగా ఉన్న పవన్
ప్ర‌జ‌ల‌కు సినీనటుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌స‌రా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రెస్‌నోట్ విడుద‌ల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ, దేశ ప్ర‌జ‌ల‌కు త‌న‌ త‌ర‌ఫున, జ‌న‌సేన శ్రేణుల త‌ర‌ఫున విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాన‌ని అందులో పేర్కొన్నారు.

బ‌తుక‌మ్మ ఆట‌పాట‌ల‌తో ఊరూ వాడ‌ల‌ను భ‌క్తి పార‌వ‌శ్యంతో ముంచెత్తిన ఆడ‌ప‌డుచుల‌కు శుభాభినంద‌న‌లని పవన్ కల్యాణ్ అన్నారు. ప్ర‌స్తుతం త‌మ పార్టీ స‌భ్య‌త్వాల‌పై దృష్టిపెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోవైపు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తూ బిజీబిజీగా ఉన్నారు.  
pawan kalyan

More Telugu News