నా అభిమాన అనుష్కతో కలిసి మహానుభావుడు చూశాను: కథానాయిక మెహరీన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా అభిమాన అనుష్కతో కలిసి మహానుభావుడు చూశాను: కథానాయిక మెహరీన్

  • ‘మహానుభావుడు’ ఫస్ట్‌ షో చూశానన్న మెహరీన్‌
  • సినిమాకు పాజిటివ్ టాక్
  • సోషల్ మీడియాలో నటీనటుల శుభాకాంక్షలు
  • పెద్దహీరోలతో పోటీపడి మరో విజయం సొంతం చేసుకున్న శర్వానంద్
ప్రముఖ కథానాయిక అనుష్కతో కలిసి తన సినిమా ‘మహానుభావుడు’ ఫస్ట్‌ షో చూశానని కథానాయిక మెహరీన్‌ ఆనందం వ్యక్తం చేసింది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శర్వానంద్‌ సరసన ఆమె నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నేడే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిషోతోనే మంచి టాక్ సొంతం చేసుకుంది.

 గతంలో పెద్దహీరోల చిత్రాలతో పోటీ పడి శర్వానంద్ విజయం సాధించడంతో ఇప్పుడు కూడా ‘మహానుభావుడు’ సినిమాను అదే పోటీ మధ్య నిర్మాతలు విడుదల చేశారు. వారి సెంటిమెంటును నిజం చేస్తూ, ఈ సినిమా విజయం సాధించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పలువురు చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఈ క్రమంలో తన సినిమాను ఈ రోజు చూసేశానని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన మెహరీన్... ‘‘నా అభిమాన నటి స్వీటీ గారితో కలసి ‘మహానుభావుడు’ ఫస్ట్‌ షో చూశా. చాలా ప్రత్యేకమైన మూమెంట్‌’’ అంటూ పోస్టు చేసింది. దీనికి వారి అభిమానుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. 
mahanubhavudu
mehrene kaur pirzada
mehrene kaur
movie

More Telugu News