ముంబై రైల్వేస్టేషన్ లో తొక్కిసలాట.. ప్రాణాలు కోల్పోయిన 22 మంది ప్రయాణికులు!
- నాలుగు రైళ్లు స్టేషన్ కు ఒకేసారి చేరుకోవడంతో ప్రయాణికుల హడావిడి
- తొక్కిసలాటలో 22 మంది మృతి.. 50 మందికి గాయాలు
ఈ తొక్కిసలాటలో 22 మంది ప్రాణాలుకోల్పోగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రుల్లో చేర్చారు. దీనిపై కేసు నమోదు చేసిన రైల్వే శాఖ, దర్యాప్తు ప్రారంభించింది. రైల్వే మంత్రి పియూష్ గోయల్ సంఘటనా స్థలికి బయల్దేరారు.