రాంగ్ ట్వీట్... బీసీసీఐని ఏకిపారేసిన నెటిజన్లు!

  • ఘోర తప్పిదం చేసిన బీసీసీఐ
  • నాలుగో వన్డేను తొలి టీ20గా పేర్కొన్న బీసీసీఐ
  • మండిపడ్డ నెటిజన్లు
బీసీసీఐ చేసిన ఒక తప్పిదం క్రికెట్ అభిమానుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో, బీసీసీఐ నిర్లక్ష్యాన్ని వారు తూర్పారబట్టారు. అసలు ఏం జరిగిందంటే... నిన్న భారత్, ఆస్ట్రేలియాల మధ్య నాలుగో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ కు ముందు నాలుగో వన్డే అని కాకుండా తొలి టీ20 అంటూ తన ట్విట్టర్ ఖాతాలో బీసీసీఐ పేర్కొంది.

తొలి ట్వీట్ లో 'భారత్-ఆస్ట్రేలియా ల మధ్య జరుగుతున్న తొలి టీ20కి స్వాగతం' అని పేర్కొంది
రెండో ట్వీట్ లో 'ఫస్ట్ టీ20: ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది' అని తెలిపింది.

దీంతో, నెటిజన్లు బీసీసీఐపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఆ తర్వాత చేసిన తప్పిదం తెలుసుకున్న బీసీసీఐ... ఆ ట్వీట్ లను తొలగించింది.
Go Back to Shorts
bcci
team india
cricket australia
bcci mistake on twitter

More Telugu News