ఆ రేంజ్ లో లేకున్నా బాగానే ఉంది: 'మహానుభావుడు'పై ఓవర్సీస్ రిపోర్టు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ రేంజ్ లో లేకున్నా బాగానే ఉంది: 'మహానుభావుడు'పై ఓవర్సీస్ రిపోర్టు!

  • స్టార్ హీరోల మధ్య దూరి హిట్ కొట్టేస్తున్న శర్వానంద్
  • ఓవర్ సీస్ లో 'మహానుభావుడు' ప్రీమియర్స్
  • సోషల్ మీడియాలో కనిపిస్తున్న రివ్యూలు
  • సినిమా హిట్ అని ప్రాథమిక టాక్
స్టార్ హీరోల సినిమాల మధ్య దూరిపోతూ హిట్ మీద హిట్ కొట్టేస్తున్న శర్వానంద్, ఈ దసరాకు కూడా అదే పని చేశాడు. ఎన్టీఆర్ 'జై లవకుశ', మహేశ్ బాబు 'స్పైడర్' చిత్రాల మధ్య శర్వానంద్ నటించిన 'మహానుభావుడు' తెలుగు రాష్ట్రాల్లో నేడు విడుదల కానుండగా, విదేశాల్లో ఇప్పటికే ప్రీమియర్ షోలు పడిపోయాయి. వాటి రిపోర్టు పాజిటివ్ గానే వస్తోంది.

ఈ చిత్రం 'భలే భలే మగాడివోయ్' చిత్రాన్ని గుర్తుకు తెచ్చిందని, ఆ స్థాయిలో కాకున్నా బాగానే అలరించిందని ఎన్నారై ప్రేక్షకులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. తన మనసుకు నచ్చిన అమ్మాయికి ముద్దు పెట్టాలన్నా కూడా అతి శుభ్రత పాటించే వ్యక్తిగా, గుడిలోకి వెళ్లాలన్నా కూడా కాళ్లకు మట్టి అంటుతుందన్న ఉద్దేశంతో సాక్స్ తో వెళ్లిపోయే వాడిగా శర్వానంద్ బాగా నటించాడని చెబుతున్నారు. అలాంటి వ్యక్తి తన ప్రేమ కోసం ప్రేయసి ఇంటికి వెళ్లి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడన్న విషయాన్ని వినోదం మిస్ కాకుండా దర్శకుడు మారుతి తెరకెక్కించాడని, దసరాకు శర్వానంద్ హిట్ కొట్టినట్టేనని అంటున్నారు.
sarvanand
mahanubhavudu

More Telugu News