జవాన్ల సంఖ్యను అమాంతం పెంచేసుకుంటోన్న ఉత్తరకొరియా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జవాన్ల సంఖ్యను అమాంతం పెంచేసుకుంటోన్న ఉత్తరకొరియా!

  •  47 లక్షల మంది కొత్తగా సైన్యంలో చేరేందుకు సిద్ధం
  • వారిలో విద్యార్థులు, ఉద్యోగులు కూడా
  • సైన్యంలోకి 12.2 లక్షల మంది మహిళలు 
  • కొరియా మీడియా వెల్లడి
అగ్ర‌రాజ్యం అమెరికా చేస్తోన్న‌ హెచ్చ‌రిక‌లతో పాటు ప్ర‌పంచ దేశాలు ఒక్కొక్క‌టిగా త‌మ దేశంతో సంబంధాల‌ను తెంచుకుంటుండ‌డంతో ఉత్త‌ర‌కొరియా ఏ నిమిషాన ఎటువంటి దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుందో తెలియ‌ని ప‌రిస్థితి ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఆ దేశం ఆయుధ సంపత్తిని, సైనికశక్తిని పెంచుకుంటోంద‌ని అక్క‌డి మీడియా పేర్కొంది.

  కొత్తగా సైన్యంలో చేరేందుకు ఏకంగా 47 లక్షల మంది సిద్ధంగా ఉన్నార‌ని చెప్పింది. వారిలో విద్యార్థులు, ఉద్యోగులు సైతం ఉన్నార‌ని తెలిపింది. అంతేగాక‌, 12.2 లక్షల మంది మహిళలు సైన్యంలో చేరుతామని అడిగార‌ని మీడియా పేర్కొంది. 
u.korea
war

More Telugu News