మిస్టర్ బీన్ కామెడీ ఫొటోలను పోస్ట్ చేసి.. బీజేపీని ఎద్దేవా చేసిన దిగ్విజయ్ సింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మిస్టర్ బీన్ కామెడీ ఫొటోలను పోస్ట్ చేసి.. బీజేపీని ఎద్దేవా చేసిన దిగ్విజయ్ సింగ్

  • అచ్చేదిన్ కోసం ఎదురు చూస్తూ ఇలా అయిపోయాం 
  • ట్వీట్లతో అధికార పార్టీపై విమర్శలు చేస్తోన్న దిగ్విజయ్
'భారతీయ జనతా పార్టీ నినాదం అయిన ‘అచ్చేదిన్’ కోసం ఎదురు చూస్తూ ఇలా అయిపోయాం..' అంటూ ఏఐసీసీ జన‌ర‌ల్ సెక్ర‌ట‌రీ దిగ్విజ‌య్ సింగ్ ఈ రోజు మిస్టర్ బీన్ కామెడీ ఫొటోలు పోస్ట్ చేశారు. 2014 లో మిస్ట‌ర్ బీన్ ‘అచ్చేదిన్’ కోసం ఎదురు చూస్తున్న‌ట్లు, 2015 లో ఎదురు చూసీ చూసీ అలిసిపోయినట్లు, 2016 లో నిరాశ‌తో కూర్చుండిపోయిన‌ట్లు, 2017 లో ఇక ఎదురు చూసే ఓపికలేక కింద ప‌డిపోయిన‌ట్లు అందులో చూపి బీజేపీని ఎద్దేవా చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా అధికార పార్టీని విమ‌ర్శించ‌డంలో దిగ్విజ‌య్ సింగ్ ముందుంటారు. ఆయ‌న చేసే ట్వీట్లు ప‌లుసార్లు దుమారం రేపిన విష‌యం తెలిసిందే.  
mr bean
diggi raja

More Telugu News