కూతురిపై ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇంత నిఘానా?: అనిల్ కపూర్ ను ప్రశ్నిస్తున్న నెటిజన్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కూతురిపై ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇంత నిఘానా?: అనిల్ కపూర్ ను ప్రశ్నిస్తున్న నెటిజన్లు!

  • సోనమ్ సెల్ ఫోన్ ను తదేకంగా చూస్తున్న అనిల్ కపూర్
  • తాను దొరికిపోయానని కామెంట్ చేసుకున్న అనిల్
  • వైరల్ అయిన ఫోటో
తన కుమార్తె సోనమ్ కపూర్ అంటే అనిల్ కపూర్ కు ఎంత ప్రేమ, ఆప్యాయతో వివరించి చెప్పక్కర్లేదు. ఆరు పదుల వయసులో ఉన్న అనిల్, తన బిడ్డ భవిష్యత్తు గురించి ఆమె తొలి అడుగులు వేసిన వేళనే ఆలోచించారు. ఆమె బాగోగులను చూడటంలో ఇప్పటికీ ముందుండేది ఆయనే. ఇక తాజాగా, ఆమె గురించి తనకు ఎంత బాధ్యత, రక్షణాత్మ ధోరణి ఉందో అనిల్ కపూర్, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటోను పెట్టి కామెంట్ చేయగా, మరీ ఇంత నిఘా ఏంటంటూ కామెంట్లు వస్తున్నాయి.

ఇంతకీ అనిల్ కపూర్ ఏం ఫోటో పెట్టాడంటే, సోనమ్ తన స్మార్ట్ ఫోన్ లో ఏదో చూస్తుంటే, వెనకున్న అనిల్, ఆమె ఏం చేస్తుందోనన్న ఉత్సుకతతో కళ్లప్పగించి మరీ ఫోన్ స్క్రీన్ ను చూస్తున్నాడు. అదే ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్న ఆయన, "ఓ అతి రక్షణాత్మక తండ్రి కెమెరాకు దొరికిపోయాడు" అని కామెంట్ పెట్టారు. ఆపై తనకు కూడా ఇలా దొరికిపోయినందుకు సిగ్గుగా ఉందని అన్నాడు.

తుపాకులు ప్రజలను చంపలేవని. అందమైన కుమార్తెలను కలిగివున్న నాన్నలే చంపుతారని కూడా అన్నాడు. ఈ పోస్టు వైరల్ కాగా, సోనమ్ బాయ్ ఫ్రెండ్ ఆనంద్ అహూజా కూడా స్పందించి, అనిల్ చెప్పింది కరెక్టని వ్యాఖ్యానించాడు. ముంబైలో గత వారాంతంలో జరిగిన వోగ్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల కార్యక్రమంలో ఈ ఫోటో తీసినట్టు తెలుస్తోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.
anil kapoor
sonam
anand ahuza

More Telugu News