Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

11 కోట్లంటున్నారు కానీ...నా తొలి పారితోషికం జస్ట్ 75 రూపాయలు!: సల్మాన్ ఖాన్

  • తొలి పారితోషికం 75 రూపాయలు, ఆ తరువాత 750, ఆ తరువాత 1,500
  • తొలి సినిమా 'మైనే ప్యార్ కియా'కు 31,000 పారితోషికం
  • ఆ తరువాత 75,000 పారితోషికం
  • 2017 ఫోర్బ్స్ నటుల జాబితాలో రెండో స్థానం
'నా తొలి పారితోషికం ఎంతో తెలుసా.. జస్ట్ 75 రూపాయలు' అన్నాడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. దాని గురించి తాజాగా వివరిస్తూ, ''సినిమాల్లోకి రాకముందు తాజ్‌ హోటల్‌ ముందు జరుగుతున్న ఓ షోలో డ్యాన్స్‌ చేశాను. స్నేహితుడితో కలిసి ఆ రోజు సరదాగా డ్యాన్స్‌ చేసినందుకు లభించిన పారితోషికం 75 రూపాయలు. ఈ తరువాత ఒక శీతలపానీయ ఉత్పత్తి సంస్థ వాణిజ్య ప్రకటనలో నటించినందుకు 750 రూపాయలు ఇచ్చారు. ఆ తరువాత దానికి 1,500 రూపాయల జీతం ఇచ్చేవారు" అని చెప్పాడు.

"ఇక తొలి సినిమా 'మైనే ప్యార్‌ కియా’లో నటించినందుకు 31,000 రూపాయల పారితోషికం ఇచ్చారు. అదే తొలిసారి అందుకున్న భారీ మొత్తం. ఈ తరువాత కొన్నాళ్ల పాటు ఒక్కో సినిమాకు 75,000 రూపాయల పారితోషికం తీసుకునేవాడిని" అని చెప్పాడు. ఇక ఇప్పుడు 'బిగ్ బాస్' రియాలిటీ షో 'సీజన్ 11'కి హోస్ట్ గా చేయడానికి సల్మాన్ ఒక్కో ఎపిసోడ్ కి 11 కోట్లు చార్జ్ చేస్తున్నాడట. అన్నట్టు, 2017 ఫోర్బ్స్ నటుల జాబితాలో సల్లూ భాయ్ రెండో స్థానంలో నిలవడం విశేషం.  
salman khan
remuneration
bigg boss

More Telugu News