11 కోట్లంటున్నారు కానీ...నా తొలి పారితోషికం జస్ట్ 75 రూపాయలు!: సల్మాన్ ఖాన్
- తొలి పారితోషికం 75 రూపాయలు, ఆ తరువాత 750, ఆ తరువాత 1,500
- తొలి సినిమా 'మైనే ప్యార్ కియా'కు 31,000 పారితోషికం
- ఆ తరువాత 75,000 పారితోషికం
- 2017 ఫోర్బ్స్ నటుల జాబితాలో రెండో స్థానం
"ఇక తొలి సినిమా 'మైనే ప్యార్ కియా’లో నటించినందుకు 31,000 రూపాయల పారితోషికం ఇచ్చారు. అదే తొలిసారి అందుకున్న భారీ మొత్తం. ఈ తరువాత కొన్నాళ్ల పాటు ఒక్కో సినిమాకు 75,000 రూపాయల పారితోషికం తీసుకునేవాడిని" అని చెప్పాడు. ఇక ఇప్పుడు 'బిగ్ బాస్' రియాలిటీ షో 'సీజన్ 11'కి హోస్ట్ గా చేయడానికి సల్మాన్ ఒక్కో ఎపిసోడ్ కి 11 కోట్లు చార్జ్ చేస్తున్నాడట. అన్నట్టు, 2017 ఫోర్బ్స్ నటుల జాబితాలో సల్లూ భాయ్ రెండో స్థానంలో నిలవడం విశేషం.