సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • ఇక తన టైమ్ మొదలైందని అంటున్న మెహ్రీన్ 
  • 'రంగస్థలం 1985' వేడుకకు పవన్ 
  • స్పెయిన్ కి వెళుతున్న సూర్య
*  'ఇక నా టైం మొదలైంది..' అంటోంది అందాలభామ మెహ్రీన్. ఆమె నటించిన 'మహానుభావుడు' చిత్రం విడుదల నేపథ్యంలో మాట్లాడుతూ "ఏడాదిన్నరగా నా సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. మహానుభావుడు నుంచి ఇక నా సినిమాలు వరుసగా వస్తాయి. నా టైం వచ్చింది" అని చెప్పింది మెహ్రీన్.      
*  రామ్ చరణ్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న 'రంగస్థలం 1985' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల వేడుకను త్వరలో నిర్వహిస్తారు. దీనికి పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్ గా విచ్చేస్తాడని అంటున్నారు. సంక్రాంతికి విడుదలయ్యే ఈ చిత్రంలో సమంత నాయికగా నటిస్తోంది.
*  తమిళ కథానాయకుడు సూర్య నటిస్తున్న 'థానా సెరెంద కూట్టం' తమిళ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరింది. వచ్చే నెలలో సూర్య, కీర్తి సురేష్ లపై చివరి పాటను స్పెయిన్ లో చిత్రీకరిస్తారు. నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి కూడా డబ్ చేస్తున్నారు.
Mehrin. charan

More Telugu News