కేరళ సినీ నటి కిడ్నాప్, లైంగిక వేధింపులకు హీరో దిలీప్ ఇచ్చిన సుపారీ 3 కోట్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేరళ సినీ నటి కిడ్నాప్, లైంగిక వేధింపులకు హీరో దిలీప్ ఇచ్చిన సుపారీ 3 కోట్లు!

  • కిడ్నాప్ చేసి, వేధిస్తే కోటిన్నర సుపారీ
  • పోలీసులకు పట్టుబడితే మరో కోటిన్నర 
  • ఫిబ్రవరి 17న  కిడ్నాప్, లైంగిక వేధింపులు
  • జూలై 10న దిలీప్ అరెస్టు
కేరళ సినీ నటి కిడ్నాప్, లైంగిక వేధింపులకు మలయాళ నటుడు దిలీప్ ఇచ్చిన సుపారీ 3 కోట్ల రూపాయలని కేరళ పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని విచారణ సందర్భంగా కేరళ హైకోర్టుకు ప్రాసిక్యూషన్ తెలిపింది. ఆమెను  అపహరించేందుకు సుపారీగా 1.5 కోట్ల రూపాయలు ఇస్తానని, ఒకవేళ పోలీసులకు పట్టుబడితే మరో కోటిన్నర సుపారీ ఇస్తానని దిలీప్ ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించింది.

దీంతోనే గత ఫిబ్రవరి 17న కొచ్చిలో స్నేహితురాలి ఇంటికి వెళ్తున్న నటిని  కారులో కిడ్నాప్ చేసి, వేధించారని, ఆ వేధింపుల విషయాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు వీడియో తీసి, బెదిరించారని తెలిపింది. ఆమె  ఫిర్యాదు మేరకు పల్సర్ సునీని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈ కేసుతో ప్రమేయమున్న మరో ఐదుగురిని కూడా అరెస్టు చేశారు.

వారు వెల్లడించిన వివరాలతో పాటు, అనుమానితుల జాబితాలో ఉండడంతో జూలై 10న దిలీప్ ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి నాలుగు సార్లు దిలీప్ బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నా, సాక్ష్యాలు తారుమారు చేస్తారన్న కారణంగా న్యాయస్థానం ఆయనకు బెయిల్ తిరస్కరిస్తున్న సంగతి తెలిసిందే. 
bhavana
dilip
molluwood

More Telugu News