Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

  • రేపు స‌ద్దుల బ‌తుక‌మ్మ
  • ఎల్బీ స్టేడియం, ట్యాంక్‌బండ్‌పైన ఘ‌నంగా సంబురాలు
  • సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
  • సూచించిన ప్రాంతాల మీదుగా ఎల్బీ స్టేడియం, ట్యాంక్‌బండ్‌కి చేరుకోవాలి
తెలంగాణ సంస్కృతిని ప్ర‌తిబింబింప‌జేసే బతుకమ్మ సంబురాలు రేప‌టితో ముగియ‌నున్నాయి. చివ‌రిరోజున నిర్వ‌హించే స‌ద్దుల బ‌తుక‌మ్మను హైద‌రాబాద్‌లోని ఎల్బీ స్టేడియం, ట్యాంక్‌బండ్‌పైన ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో రేపు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయ‌ని హైద‌రాబాద్‌ సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

 కింగ్ కోఠి నుంచి వచ్చే వాహనాలను కింగ్ కోఠి ఎక్స్ రోడ్ మీదుగా అబిడ్స్ తాజ్ మహల్ హోటల్ నుంచి దారి మళ్లిస్తున్న‌ట్లు చెప్పారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ కు వచ్చే వాహనాలు కర్బలా మైదాన్, బైబిల్ హౌజ్, కవాడి గూడ, లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వచ్చేలా దారి మళ్లిస్తారు.

హిమాయత్ నగర్ వై జంక్షన్ నుంచి లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపున‌కు వెళ్లాల్సి ఉంటుంది. పంజాగుట్ట, రాజ్ భవన్ రోడ్ ద్వారా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ నుంచి వచ్చే వాహనాలను ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్న ఇందిరా గాంధీ విగ్రహం వరకు మాత్రమే అనుమతిస్తారు. 
hyderabad traffic

More Telugu News