తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం

  • బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
  • దట్టమైన మేఘాలు కమ్ముకునే అవకాశం
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో ఆక‌స్మికంగా మార్పులు సంభవిస్తాయని తెలిపారు. అలాగే దట్టమైన మేఘాలు కమ్ముకుంటాయని చెప్పారు. మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌లు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంద‌ని పేర్కొన్నారు. కాగా, ఈ రోజు హైద‌రాబాద్‌తో పాటు ఏపీ, తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో ఓ మోస్తరు వ‌ర్షాలు కురిశాయి. 
Go Back to Shorts
rain

More Telugu News