'చిన్నారులపై లైంగిక వేధింపుల'పై డాక్యుమెంటరీలు... సినిమా థియేటర్లలో ప్రదర్శన
- సినిమాకు ముందు ప్రదర్శించేందుకు యోచిస్తోన్న కేంద్రం
- విరామ సమయంలో షార్ట్ ఫిల్మ్‌లు
- మొదట ఢిల్లీలోని 11 థియేటర్లలో అమలు
అంతేకాకుండా, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే విధించే శిక్షల గురించి షార్ట్‌ఫిల్మ్‌లను సినిమా విరామ సమయంలో ప్రసారం చేసేందుకు కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రయోగాత్మంగా మొదట ఢిల్లీలోని 11 థియేటర్లలో ఈ వీడియోలను ప్రసారం చేసి, తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న సినిమాహాళ్లలో అమలు చేయనున్నారు. ఈ డాక్యుమెంటరీ వీడియోలను జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ రూపొందిస్తోంది.