Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైద‌రాబాద్‌లో మరో నకిలీ బాబా అరెస్టు!

  • భ‌విష్య‌వాణి పేరిట మోసాలు
  • జాతకాలు చెబుతూ డబ్బులు వసూలు
  • రూ.5 లక్షలు, 5 కిలోల వెండి, కారు, నకిలీ సీబీఐ గుర్తింపుకార్డు స్వాధీనం
జాత‌కాలు చెబుతామంటూ, ద‌రిద్రాన్ని వ‌ద‌ల‌కొడ‌తామంటూ హైద‌రాబాద్‌లో అమాయ‌కుల వ‌ద్ద డ‌బ్బులు తీసుకుంటోన్న న‌కిలీ బాబాల ఆగ‌డాల‌కు పోలీసులు చెక్ పెడుతున్నారు. న‌గ‌రంలోని బల్కంపేటలో రంగురాళ్లను మహిమ గల రాళ్లు అని చెబుతూ మోసం చేస్తోన్న ఓ బాబాను నిన్న పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఈ రోజు న‌గ‌రంలోని వనస్థలిపురంలో పోలీసులు మ‌రో బాబాను అరెస్టు చేశారు.

నర్సింహాచార్యులు అనే వ్య‌క్తి భ‌విష్య‌వాణి పేరిట మోసాల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని, అత‌డి వ‌ద్ద సీబీఐ న‌కిలీ గుర్తింపు కార్డు కూడా ఉంద‌ని పోలీసులు గుర్తించారు. ఆ బాబా వ‌ద్ద నుంచి రూ.5 లక్షలు, 5 కిలోల వెండి, ఓ కారు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
baba

More Telugu News