తెలుగు రాష్ట్రాల్లో స్పైడర్ సందడి.. ధియేటర్ల వద్ద అభిమానుల హంగామా!

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన 'స్పైడర్' సినిమా నేడు అభిమానుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో 'స్పైడర్' రీలీజైన ధియేటర్ల వద్ద సందడి నెలకొంది. మహేష్ బాబు, కృష్ణ ఫ్యాన్స్ థియేటర్ల ముందు హల్ చల్ చేస్తున్నారు. ఆన్ లైన్ లో టికెట్ విక్రయాలు జరపడంతో థియేటర్ వద్ద టికెట్లు దొరికే అవకాశం లేకుండా పోయిందని పలువురు వాపోతున్నారు.

కాగా, ఏపీలో మహేష్ బాబు సినిమా టికెట్ల కోసం అభిమానులు పోటీ పడుతుండడంతో డిమాండ్ ఏర్పడింది. పలు థియేటర్లకు రాజకీయ నాయకుల సిఫారసులు వెల్లువెత్తుతున్నట్టు సమాచారం. కాగా, ఈ సినిమా విజయంపై చిత్రయూనిట్ ధీమాగా వుంది. 
Go Back to Shorts
spaider
maheshbabu
murugadas
rakul preet singh
spaider movie

More Telugu News