Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'నీకు 20 ఏళ్లే ఉంటాయి...' అంటూ 41 ఏళ్ల మోడల్ ను అడ్డుకున్న ఎయిర్ పోర్టు అధికారులు.. ఎగిరి గంతేసిన సుందరాంగి!

  • తప్పుడు పాస్ పోర్టుతో ప్రయాణిస్తున్నావని అడ్డుకున్న అధికారులు
  • ఆపై నటాలియాను గమనించి చుట్టుముట్టిన అభిమానులు
  • కాంప్లిమెంట్ అద్భుతమంటూనే అధికారుల వైఖరిని విమర్శించిన మోడల్
టర్కీ వెళ్లి తిరిగి తన దేశానికి బయలుదేరిన ఓ మోడల్ కు విమానాశ్రయంలో వింతైన అనుభవం ఎదురైంది. "నీకు అంత వయసు ఉండదు. తప్పుడు పాస్ పోర్టుపై ప్రయాణిస్తున్నావు" అని ఆరోపిస్తూ ఎయిర్ పోర్టు అధికారులు 41 ఏళ్ల వయసున్న మోడల్ నటాలియా జన్కివ్ ను అదుపులోకి తీసుకున్నారు. 'మిర్రర్' దినపత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం, నటాలియా పాస్ పోర్టును పరిశీలించిన అధికారులు, ఆమెకు 20 సంవత్సరాలు మాత్రమే ఉంటాయని, పాస్ పోర్టులో 41 ఏళ్లని రాసుండటంతో అనుమానంగా ఉందని చెబుతూ ప్రయాణానికి అనుమతించలేదు.

ఇక ఈ ఘటన ద్వారా తనకు లభించిన కాంప్లిమెంట్స్ (వయసును తక్కువగా అంచనా వేయడం)తో నటాలియా ఎగిరి గంతేసినంత పని చేసిందట. ఇది అద్భుతమైన కాంప్లిమెంట్ అని, తనకు నచ్చిందని చెబుతూనే, నన్ను ప్రయాణించకుండా నిలువరించడానికి ఇదే ఎలా కారణమవుతుందని ప్రశ్నించింది. అధికారులు ఆమెను ప్రశ్నిస్తుండగా, ఆమె అభిమానులు కొందరు గుర్తుపట్టారు. వెంటనే ఎయిర్ పోర్టులో ఆమె సెలబ్రిటీగా మారిపోగా, అభిమానులంతా సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ లంటూ ఎగబడటంతో, అధికారులకూ విషయం తెలిసింది. ఇక ఆమె పూర్తి శాకాహారి కావడం, పండ్లు, కూరగాయలు మినహా మరేమీ తినకపోవడంతోనే వయసు పెరిగినా ఆమె అలా కనిపిస్తోందని ఓ అభిమాని వ్యాఖ్యానించడం గమనార్హం.
natalia
turkey
passport

More Telugu News