Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వచ్చే నెలంతా రాశి ఖన్నా సందడే!

  •  వరుస సినిమాలతో పలకరించనున్న రాశి ఖన్నా 
  •  'రాజా ది గ్రేట్' లో ఆమె స్పెషల్ సాంగ్ హైలైట్
  •  మలయాళంలో ఆమె చేసిన 'విలన్' రిలీజ్ కూడా వచ్చే నెలలోనే
  •  'ఆక్సిజన్' తో వచ్చే నెల 27న ఆడియన్స్ ముందుకు 
తెలుగు తెరపై గ్లామర్ తో ఫుల్ మార్క్స్ కొట్టేసిన కథానాయికలలో రాశి ఖన్నా ఒకరు. ఆమె కెరియర్లో చేసిన పెద్ద సినిమా 'జై లవ కుశ' అనే చెప్పాలి. ఈ సినిమా కోసం ఆమె నాజూకుగా మారింది. ఎప్పటిలానే తన గ్లామర్ తో కుర్రకారులో హుషారెత్తించింది. ఇక వచ్చే నెలలోను ఆమె వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించనుంది.

 ఆమె స్పెషల్ సాంగ్ చేసిన 'రాజా ది గ్రేట్' వచ్చే నెల 12వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకి ఆమె స్పెషల్ సాంగ్ హైలైట్ అంటున్నారు కనుక, ఆమెకి ఈ సాంగ్ మరింత క్రేజ్ తీసుకువస్తుందనిపిస్తోంది. ఇక మలయాళంలో ఆమె చేసిన 'విలన్' తెలుగులోను వచ్చే నెల 19న విడుదల కానుంది. మోహన్ లాల్ .. విశాల్ ప్రధాన పాత్రలుగా ఈ సినిమా రూపొందింది. ఇక గోపీచంద్ తో చేసిన 'ఆక్సిజన్' వచ్చే నెల 27వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. ఇలా వచ్చే నెలంతా రాశి ఖన్నా తన గ్లామర్ తో సందడి చేయనుండటం విశేషం.   
rasi khanna

More Telugu News