ఐడీ కార్డులు ఇక మర్చిపోండి.. బయోమెట్రిక్‌తోనే విమానంలోకి ఎంట్రీ!
- విమానాశ్రయాల్లో పేపర్ రహిత విధానం
- ఇక కార్డులకు చెక్ పడినట్టే
- వేలి ముద్రతోనే అన్నీ పూర్తి
విమాన టికెట్ కానీ, ఈ-టికెట్ కానీ ఇక చూపించాల్సిన పని ఉండదని ఏవియేషన్ సెక్రటరీ ఆర్ఎన్ చౌబే తెలిపారు. బయోమెట్రిక్‌లో ప్రయాణికుడు తన వేలిని పెట్టగానే అతడు టికెట్ తీసుకున్నదీ, లేనిదీ వంటి అన్ని వివరాలు కనిపిస్తాయి. అంతేకాదు, అతడు సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకున్నాడా? లేదా? అన్న విషయం కూడా తెలిసిపోతుంది. ఈ ‘డిజియాత్ర’ విధానానికి ఏవియేషన్ అథారిటీ తుది రూపు ఇచ్చే పనిలో పడింది.