వామ్మో హనీప్రీత్!.. ఆమె ప్లాన్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవాల్సిందే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వామ్మో హనీప్రీత్!.. ఆమె ప్లాన్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవాల్సిందే!

  • తన సంతానాన్ని డేరా చీఫ్‌గా చేయాలని పథకం
  • గుర్మీత్‌పై ఒత్తిడి.. సరేనన్న బాబా
  • వెల్లడించిన గుర్మీత్ మాజీ భక్తులు
సినిమాలు, సీరియళ్లలోనే కుట్రలు కుతంత్రాలతో కూడిన ప్లాన్‌లు కనిపిస్తుంటాయి. కానీ డేరా చీఫ్ గుర్మీత్ బాబా దత్తపుత్రికగా చెప్పుకుంటున్న హనీప్రీత్ రచించిన ప్లాన్ ఒకటి వాటిని తలదన్నేలా వుంది. సాధ్వీలపై అత్యాచారం కేసులో గుర్మీత్ జైలుకు వెళ్లాక డేరా చీఫ్‌గా హనీప్రీత్ పేరు కొన్నాళ్లు చక్కర్లు కొట్టింది. అయితే బాబా అరెస్ట్ తర్వాత ఆమె కనిపించకుండా పోయింది. ప్రస్తుతం పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

డేరా చీఫ్ మాజీ భక్తులు కట్టా సింగ్, అతని కుమారుడు గురుదాస్ సింగ్, గురుదాస్ సింగ్‌తోర్‌ల కథనం ప్రకారం.. గుర్మీత్ సామ్రాజ్యంపై కన్నేసిన హనీప్రీత్.. గుర్మీత్ ద్వారా బిడ్డను కని అతడిని డేరా చీఫ్‌ని చేయాలని పథకం రచించిందట. అందుకు బాబా కూడా అంగీకరించాడట. గుర్మీత్ చేతుల్లో హనీప్రీత్ అత్యాచారానికి గురైన తర్వాత హనీప్రీత్ ఆయనకు మరింత సన్నిహితంగా మెలుగుతూ ఈ ప్లాన్ రచించిందని వారు పేర్కొన్నారు.

గుర్మీత్ 2007లో తన వారసుడిగా జస్మిత్‌ను ప్రకటించాడు. అయితే తనకు  కలిగే బిడ్డను డేరా చీఫ్‌ను చేయాలని హనీప్రీత్ ఒత్తిడి చేయడంతో అందుకు గుర్మీత్ అంగీకరించాడు. తమకు కలిగే బిడ్డను తన భర్త విశ్వాస్ గుప్తా సంతానంగా చూపించాలని వీరు భావించారు. అయితే గుప్తా విడాకులు ఇవ్వడంతో వారి ప్లాన్ పారలేదు. ఈ లోపు గుర్మీత్ జైలు పాలవడంతో మొత్తం వ్యవహారం బెడిసికొట్టింది.  ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ తీర్పును  పునఃపరిశీలించాల్సిందిగా సోమవారం పంజాబ్-హరియాణా హైకోర్టును ఆశ్రయించాడు.
 
Honeypreet
dera chief
gurmeet baba

More Telugu News