వైర‌ల్ వీడియో: `జిమ్మిక్కీ క‌మ్మాల్` పాట‌కు మోహ‌న్‌లాల్ స్టెప్పులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైర‌ల్ వీడియో: `జిమ్మిక్కీ క‌మ్మాల్` పాట‌కు మోహ‌న్‌లాల్ స్టెప్పులు

  • `జిమ్మిక్కీ క‌మ్మాల్` పాట‌ సూపర్ హిట్ 
  • డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసిన హీరో
  • విప‌రీతంగా షేర్లు, లైకులు చేస్తున్న అభిమానులు
మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్‌లాల్ న‌టించిన `వెలిపాడిందే పుస్త‌గం` చిత్రంలోని `జిమ్మిక్కీ క‌మ్మాల్` పాట ట్రెండ్‌గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి ఒక్క‌రూ ఈ పాట‌కు స్టెప్పులేసి వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వారిలో కొంత‌మంది అభిమానులు హీరో మోహ‌న్‌లాల్‌ని కూడా ఈ పాట‌కు డ్యాన్స్ వేయాల‌ని కోరారు.

నిజానికి ఈ సినిమాలో హీరో ఆయ‌నే అయిన‌ప్ప‌టికీ ఈ పాట‌లో ఆయ‌న డ్యాన్స్ చేస్తూ క‌నిపించ‌రు. పాట చివ‌ర్లో మాత్రం సైకిల్ న‌డుపుతూ క‌నిపిస్తారు. అందుకే అభిమానులు ఆయ‌న్ని ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్‌కు స‌మాధానం చెబుతూ మోహ‌న్‌లాల్ పాట‌కు స్టెప్పులేసి వీడియోను త‌న ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. పోస్ట్ చేసిన 19 గంటల్లోనే ల‌క్షా డెబ్బై వేల‌కు పైగా లైకులు, 90 వేల‌కు పైగా షేర్లు, 50 ల‌క్ష‌ల‌కు పైగా వీక్ష‌ణ‌ల‌ను సంపాదించుకుంది.

mohan lal
jimmikki kammal
viral video
dance

More Telugu News