ఓ కులం మొత్తాన్ని ఎలా కించపరుస్తారన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక విసురుగా వెళ్లిపోయిన కంచె ఐలయ్య!
- ఓ కులాన్ని సామాజిక స్మగ్లర్లు అని ఎలా అంటారు?
- పదే పదే అడిగినా సమాధానం చెప్పని కంచె ఐలయ్య
- 'ఐయామ్ గోయింగ్' అంటూ లేచి వెళ్లిపోయిన వైనం
తాను మొదటి నుంచి ఒకటే ప్రశ్న అడుగుతున్నానని, అందరినీ ఒకే గాటన ఎలా కట్టగలుగుతున్నారు? దీనికి మాత్రం సమాధానాన్ని మీరు చెప్పడం లేదు? అని యాంకర్ అడుగగా, తాను రీసెర్చ్ చేసి బుక్ రాశానని మాత్రమే చెప్పారు. ఓ కులం వాళ్లు సామాజిక స్మగ్లర్లు అని కులం మొత్తంపై అభాండాలు వేయడం ఏంటని అడుగగా, "మొత్తం జ్యుడీషియరీకి వదిలిపెట్టండి. పోలీస్ వ్యవస్థకు వదిలిపెట్టండి. మీరు మరీమరీ ఇదే అడుగుతుంటే మాత్రం... ఐయామ్ గోయింగ్" అంటూ లేచి వెళ్లిపోయారు.