అంజలి చెల్లెలు ఆరాధ్య కూడా వస్తోంది!
- కథానాయికగా అంజలికి మంచి గుర్తింపు వుంది
- ఆమె చెల్లెలు ఆరాధ్య కూడా ఎంట్రీ ఇస్తోంది
- తెలుగు .. తమిళ సినిమాలకి ఓకే చెప్పేసింది
- మంచి పాత్రలు వస్తే టాలెంట్ నిరూపించుకుంటుందట
ఇక కథానాయిక అంజలి కజిన్ సిస్టర్ 'ఆరాధ్య' కూడా త్వరలో వెండితెరపైకి రానుంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పింది. తన గ్లామర్ చూసి సినిమాల్లోకి వెళ్లమంటూ స్నేహితులు పదేపదే చెబుతూ ఉండటంతో, తనలో ఆసక్తి కలిగిందని అంది. అక్క అంజలి స్ఫూర్తితోనే ఈ రంగంలోకి అడుగుపెట్టానని చెప్పింది. ప్రస్తుతం తమిళంలో సముద్ర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాననీ, తెలుగులోను ఒక సినిమాకి ఓకే చెప్పానని అంది. మంచి పాత్రలు .. కథలు వస్తే తన టాలెంట్ ను నిరూపించుకుంటానని చెప్పుకొచ్చింది.