Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంజలి చెల్లెలు ఆరాధ్య కూడా వస్తోంది!

  •  కథానాయికగా అంజలికి మంచి గుర్తింపు వుంది
  •  ఆమె చెల్లెలు ఆరాధ్య కూడా ఎంట్రీ ఇస్తోంది
  •  తెలుగు .. తమిళ సినిమాలకి ఓకే చెప్పేసింది
  •  మంచి పాత్రలు వస్తే టాలెంట్ నిరూపించుకుంటుందట  
బాలీవుడ్ .. కోలీవుడ్ .. టాలీవుడ్ ఇలా ఎక్కడైనా ఒక కథానాయిక స్టార్ గా మారిపోతే ఆ తరువాత వాళ్ల సిస్టర్స్ కూడా రంగప్రవేశం చేస్తుంటారు. అయితే అలా వెనక వచ్చిన వాళ్లు స్టార్ స్టేటస్ ను అందుకున్న దాఖలాలు చాలా తక్కువ. అయినా ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తూనే వుంటారు.

ఇక కథానాయిక అంజలి కజిన్ సిస్టర్ 'ఆరాధ్య' కూడా త్వరలో వెండితెరపైకి రానుంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పింది. తన గ్లామర్ చూసి సినిమాల్లోకి వెళ్లమంటూ స్నేహితులు పదేపదే చెబుతూ ఉండటంతో, తనలో ఆసక్తి కలిగిందని అంది. అక్క అంజలి స్ఫూర్తితోనే ఈ రంగంలోకి అడుగుపెట్టానని చెప్పింది. ప్రస్తుతం తమిళంలో సముద్ర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాననీ, తెలుగులోను ఒక సినిమాకి ఓకే చెప్పానని అంది. మంచి పాత్రలు .. కథలు వస్తే తన టాలెంట్ ను నిరూపించుకుంటానని చెప్పుకొచ్చింది.  
aradhya

More Telugu News