ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు తోచలేదు!: ఎన్టీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు తోచలేదు!: ఎన్టీఆర్

  • కెరియర్ ఆరంభంలోనే భారీ హిట్లు
  •  ఆ కారణంగా కథల ఎంపికలో తడబాటు
  •  వరుసగా పలకరించిన పరాజయాలు
  •  'టెంపర్' సినిమా కెరియర్ ను మళ్లీ గాడిలో పెట్టింది
టెంపర్ .. నాన్నకు ప్రేమతో .. జనతా గ్యారేజ్ వంటి వరుస హిట్లతో వున్న ఎన్టీఆర్, తాజాగా 'జై లవ కుశ'కి వస్తోన్న రెస్పాన్స్ చూసి ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. గతంలో కెరియర్ పరంగా తనకెదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. 'స్టూడెంట్ నెంబర్ వన్' తో సక్సెస్ అనే మాట విన్న తాను, ఆ తరువాత 'ఆది' .. 'సింహాద్రి' వంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నట్టుగా చెప్పాడు.

అప్పటికి తన వయసు 22 యేళ్లు మాత్రమే కావడంతో, తదుపరి సినిమాలను ఎంచుకోవడంలో తడబడ్డానని అన్నాడు. దాంతో వరుసగా పరాజయాలను ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పాడు. అలాంటి పాత్రలు చేయవద్దని కొందరు .. ఇలాంటి పాత్రలు చేయవద్దని కొందరు చెప్పారు గానీ, ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలనేది మాత్రం ఎవరూ చెప్పలేదని అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో తనకేం చేయాలో తోచలేదనీ, ఆ సమయంలో వచ్చిన 'టెంపర్' మళ్లీ తన కెరియర్ ను ఒక గాడిలో పెట్టిందని చెప్పుకొచ్చాడు.      
ntr

More Telugu News