కీర్తి సురేశ్ డేట్స్ కావాలంటే ఓ ఏడాది ఆగాల్సిందే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కీర్తి సురేశ్ డేట్స్ కావాలంటే ఓ ఏడాది ఆగాల్సిందే!

  •  కీర్తి సురేశ్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్
  •  తెలుగు .. తమిళ భాషల్లో వరుస సినిమాలు
  •  ఆమె డేట్స్ ఇప్పట్లో దొరికే ఛాన్స్ లేదు
  •  వచ్చే ఏడాది తెలుగు సినిమాలపైనే ఎక్కువ దృష్టి      
కీర్తి సురేశ్ తెలుగు .. తమిళ భాషా చిత్రాలకి సమానమైన ప్రాధాన్యతనిస్తూ దూసుకుపోతోంది. తెలుగులో త్రివిక్రమ్ - పవన్ మూవీతో పాటు 'మహానటి' చిత్రాన్ని చేస్తోన్న కీర్తి సురేశ్, తమిళంలోను వరుస సినిమాలు చేస్తోంది. సూర్య .. విక్రమ్ .. విజయ్ .. విశాల్ సరసన సినిమాలు చేస్తోంది. ఈ సినిమాలు పూర్తి కావడానికి ఓ ఏడాదికి పైనే పడుతుంది.

 అందువలన కీర్తి సురేశ్ ను కథానాయికగా తీసుకోవాలనుకుంటే, ఏడాదికి పైనే వెయిట్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రాజెక్టులు పూర్తి కాగానే ఆమెను తమ సినిమాల్లోకి తీసుకోవడానికి గాను, ఇటు తెలుగు నుంచి .. అటు తమిళం నుంచి చాలామంది దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారట. వచ్చే ఏడాది మాత్రం ఆమె తెలుగు సినిమాలను ఎక్కువగా అంగీకరించే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. అందులో వాస్తవమెంతన్నది చూడాలి.      
keerthi suresh

More Telugu News