దెబ్బలకు స్పృహతప్పి పడిపోతే... సపర్యలు చేయాల్సింది పోయి ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు!
- నాలుగేళ్లు సజావుగా సాగిన కాపురం
- దాంపత్యానికి గుర్తుగా మూడేళ్ల కుమారుడు
- పని విషయంలో అత్తమామలతో వివాదం
- చితక్కొట్టిన భర్త
- స్పృహ తప్పిపడిపోయిన భార్యకు ట్రిపుల్ తలాక్
ఈ క్రమంలో భర్త తనను తీవ్రంగా కొట్టాడని ఆమె తెలిపింది. ఆయన కొట్టిన దెబ్బలకు తాళలేక తాను స్పృహ తప్పి పడిపోతే.. ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయింది. స్పృహలోకి వచ్చిన తరువాత ట్రిపుల్ తలాక్ చెప్పాడని, ఇల్లు విడిచి వెళ్లాలని ఆదేశించాడని తెలిపింది. తను తలాక్ చెప్పడం తనకు వినపడలేదని మొత్తుకున్నా పట్టించుకోలేదని, తనను ఇంటి నుంచి గెంటేశారని ఆమె వాపోయింది. తరువాత తాను పుట్టింటికి చేరానని, అయితే పెద్దల ద్వారా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించానని చెప్పింది.