హనీ ప్రీత్ కోసం చెప్పులరిగేలా తిరిగి.. చివరికి డేరాబాబా దగ్గరికే వచ్చిన పోలీసులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హనీ ప్రీత్ కోసం చెప్పులరిగేలా తిరిగి.. చివరికి డేరాబాబా దగ్గరికే వచ్చిన పోలీసులు!

  • హనీ ప్రీత్ ఆచూకీ కోసం ఎంతగానో గాలించిన పోలీసులు
  • చిక్కని హనీ ప్రీత్
  • నేపాల్ సరిహద్దుల్లో ఉంటుందన్న అనుమానాలు
  • పంజాబ్, హర్యానా, బీహార్, రాజస్థాన్ లో ఆమె ఆచూకీ
డేరాసచ్ఛాసౌదా చీఫ్ బాబా గుర్మీత్ రాం రహీం సింగ్ జైలుకి వెళ్లిన నాటి నుంచి అతనిని తప్పించేందుకు ప్రయత్నించిన దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. డేరాబాబాను తప్పించే ప్రయత్నం చేసిందన్న ఆరోపణలపై అరెస్టు చేసేందుకు పోలీసులు జల్లెడ పట్టారు. ఆమె దొరికితే విచారణలో ఆశ్రమం గుట్టుమట్లు వీడే అవకాశం ఉందని పోలీసు అధికారులు భావించారు. ఆమె ఆచూకీ చెప్పిన వారికి నజరానా ఇస్తామని హర్యానా, పంజాబ్, బీహార్, రాజస్థాన్ లలో ప్రకటనలు కూడా వేయించారు.

నేపాల్ సరిహద్దుల్లో వాంటెడ్ పాంప్లెట్లు కూడా అతికించారు. ఆమెను పట్టుకోవడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు నేపాల్ సరిహద్దుల్లో ఆమె ఉందని అక్కడా గాలింపు చేపట్టారు. అలాగే అనుమానం వచ్చిన ప్రతి ప్రాంతానికి వెళ్లి జల్లెడపట్టారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో ఆమెను పట్టుకునే క్రమంలో తిరగడం వల్ల చెప్పులు అరగడం తప్ప ఫలితం లేదని భావించిన పోలీసులు, డేరా బాబాను ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. హనీప్రీత్ ఆచూకీ కోసం డేరాబాబాను పోలీసులు ప్రశ్నించాలని నిర్ణయించారు. 
dera baba
gurmeet ram raheem singh
honey preet

More Telugu News