హనీప్రీత్ మా ఇంట్లో ఒక రోజు గడిపింది: బంధువు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హనీప్రీత్ మా ఇంట్లో ఒక రోజు గడిపింది: బంధువు

  • డేరా బాబాకు శిక్షపడే ముందు రోజు బంధువు ఇంట్లో హనీప్రీత్
  • తిండి మానేసింది, రాత్రంతా ఏడుస్తూనే ఉంది
  • మరుసటి రోజు వెళ్లిపోయింది
డేరా బాబా గుర్మీత్ కు శిక్ష పడిన తర్వాత ఆయన దత్త పుత్రిక హనీప్రీత్ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆమెపై లుకౌట్ నోటీసు కూడా జారీ అయింది. ఆ సందర్భంగా ఆమె బంధువు ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. గుర్మీత్ కు శిక్ష పడే ముందు రోజు హనీప్రీత్ తమ ఇంట్లో గడిపిందని రాజస్థాన్ లోని హనుమాన్ ఘర్ కు చెందిన బంధువు తెలిపారు. ఆగస్టు 28న ఆమె తమ ఇంట్లో ఉందని... ఆ మరుసటి రోజు వెళ్లిపోయిందని చెప్పారు. ఆ రోజంతా హనీప్రీత్ ఆహారపానీయాలను కూడా ముట్టుకోలేదని... చాలా టెన్షన్ గా గడిపిందని, రాత్రంతా ఏడుస్తూనే ఉందని సమాచారం. పంచకుల కోర్టు నుంచి గుర్మీత్ ను తప్పించేందుకు హనీప్రీత్ యత్నించిందనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది. 
honeypreet
dera
gurmeet

More Telugu News