హ్యాట్రిక్ బాల్ కు ముందు ధోనీ సలహా తీసుకున్న కుల్దీప్
- ధోనీ సూచన ఆత్మ విశ్వాసాన్ని పెంచింది
- తొలి ఐదు ఓవర్లలో ఇబ్బంది పడ్డా
- ఆ తర్వాత సరైన స్పాట్ ను గుర్తించా
వరుసగా రెండు వికెట్లు తీసిన తర్వాత, హ్యాట్రిక్ బాల్ వేసే ముందు తాను ధోనీని సంప్రదించానని... 'మహీ భాయ్, ఎలాంటి బాల్ వేయమంటావ్?' అని అడిగానని తెలిపాడు. దానికి సమాధానంగా, 'నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ బాల్ వెయ్' అంటూ ధోనీ ప్రోత్సహించాడని... ధోనీ మాటలతో తనలో ఆత్మ విశ్వాసం పెరిగిందని... చివరకు హ్యాట్రిక్ సాధించగలిగానని చెప్పాడు.
తొలి ఐదు ఓవర్లలో సరైన స్థానంలో బంతులను సంధించడానికి తాను ఇబ్బంది పడ్డానని... ఐదు ఓవర్ల తర్వాత కరెక్ట్ స్పాట్ ను గుర్తించానని... ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందేనని కుల్దీప్ అన్నాడు.