కంచ ఐలయ్యపై మ‌రీ ఇంత ద్వేష‌మా: మ‌హేశ్ క‌త్తి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కంచ ఐలయ్యపై మ‌రీ ఇంత ద్వేష‌మా: మ‌హేశ్ క‌త్తి

  • ప్రతి సామాజిక వ‌ర్గం త‌మ గొప్ప‌ద‌నాన్ని రాసుకుంటుంది 
  • ప్రొ.కంచ ఐల‌య్య‌ మాత్రం వారి తీరుతో విభేదించారు 
  • ఆయన ఫొటోలను కాళ్లతో తొక్కుతున్నారు
ప్ర‌తి సామాజిక వ‌ర్గం త‌మ రాజ‌కీయ, సామాజిక‌ చ‌రిత్ర‌ను గురించి రాసుకుంటూ త‌మ గొప్ప‌ద‌నాన్ని చాటి చెప్పుకుంటాయ‌ని సినీ విశ్లేష‌కుడు మ‌హేశ్ క‌త్తి అన్నారు. ఒక వ్య‌క్తి (ప్రొ.కంచ ఐల‌య్య‌) మాత్రం వారి తీరుతో విభేదించార‌ని, మ‌రో దృష్టికోణంతో ఆలోచించి కొత్త మార్గాన్ని చూపార‌ని త‌న ఫేస్‌బుక్ ఖాతాలో మ‌హేశ్ క‌త్తి పేర్కొన్నారు. అటువంటి వ్య‌క్తిపై అగ్రకులాల వారు ఇలా విద్వేషాన్ని చూపుతున్నార‌ని తెలుపుతూ.. కంచ ఐల‌య్య ఫొటోల‌ను కాలితో తొక్కుతుండ‌గా తీసిన‌ ఫొటోల‌ను, చెప్పులు వదిలే స్థ‌లంలో ఉన్న ఐల‌య్య ఫొటోల‌ను, కొందరు గుడి మెట్ల‌కింద పెట్టిన ఐలయ్య ఫొటోల‌ను మ‌హేశ్ క‌త్తి పోస్ట్ చేశారు.  
mahesh kathi
ప్రొ.కంచ ఐల‌య్య‌

More Telugu News