Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుర్మీత్ సొంత గ్రామంలో హనీప్రీత్ ఉందంటూ వార్తలు... పోలీసుల ముమ్మర సోదాలు!

  • హనుమాన్ గఢ్ జిల్లాలో పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్
  • గుర్మీత్ ఇళ్లలో సోదాలు చేసిన హర్యానా పోలీసులు
  • అయినా లభించని హనీ ప్రీత్ ఆచూకీ
హర్యానా పోలీసులు మోస్ట్ వాంటెడ్ గా భావిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ అనుంగు శిష్యురాలు హనీప్రీత్ సింగ్, రాజస్థాన్ లోని గుర్మీత్ స్వగ్రామమైన హనుమాన్ గఢ్ లోని ఆయన సొంత ఇంట్లో తలదాచుకుందని సమాచారాన్ని అందుకున్న పోలీసులు విస్తృత సోదాలు జరిపారు. హనుమాన్ గఢ్ తో పాటు గురుసార్ మోదియా గ్రామంలోని గుర్మీత్ ఇంట్లోనూ పోలీసుల సోదాలు జరిగాయి. దాదాపు నాలుగు గంటల పాటు ఈ సోదాలు జరుగగా, హనీప్రీత్ ఆచూకీపై ఎలాంటి సమాచారమూ లభించలేదని తెలుస్తోంది.

హనుమాన్ గఢ్, శ్రీగగన్ గార్, మోదియా గ్రామాల్లోని స్కూళ్లు, గుర్మీత్ అనుచరుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. గుర్మీత్ కు శిక్ష పడిన తరువాత హనీప్రీత్ హనుమాన్ గఢ్ కు వచ్చి వెళ్లినట్టు తమకు సమాచారం ఉందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. గుర్మీత్ ను తప్పించాలని చూసిన కేసుతో పాటు, అల్లర్లకు ప్రేరేపించిన కేసులో ఆమె ముద్దాయిగా ఉంది. హర్యానా పోలీసులు వచ్చి రాజస్థాన్ లో సోదాలు జరిపిన మాట వాస్తవమేనని, వారేమీ తమతో విలువైన సమాచారాన్ని పంచుకోలేదని, వారికి సహాయంగా పోలీసులను, వాహనాలను పంపించామని హనుమాన్ గఢ్ ఎస్పీ యాద్రామ్ ఫన్సాల్ తెలిపారు. రాజస్థాన్ లోని పలు డేరాల్లోనూ పోలీసులు సోదాలు జరిపినట్టు పేర్కొన్నారు.
honeypreet
dera
gurmeet

More Telugu News