Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సమంతకు డబ్బింగ్ చెబుతూ చిన్మయి ఏడ్చేసిందట!

  • 'రాజుగారి గది 2'లో దెయ్యంగా సమంత
  •  ఆమె పాత్రకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి
  •  సమంతా నటన అద్భుతం అంటూ కితాబు
  •  ఆమె సీన్స్ కి డబ్బింగ్ చెబుతూ కన్నీరు  
మొదటి నుంచి కూడా సమంతకు చిన్మయి డబ్బింగ్ చెబుతూ వస్తోంది. అసలు ఆమె డబ్బింగే సమంతకు ప్రాణమని చెప్పుకుంటూ వుంటారు. 'రాజుగారి గది 2' సినిమాలో సమంత పోషించిన పాత్రకి కూడా చిన్మయినే డబ్బింగ్ చెప్పింది. ఈ సినిమాలో సమంత తన ఫెర్ఫార్మెన్స్ తో చంపేసిందని చిన్మయి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సమంత పాత్ర .. ఆ పాత్రలో ఆమె జీవించిన తీరు చూసి, డబ్బింగ్ చెబుతూనే ఏడ్చేశానని చిన్మయి చెప్పింది.

 చిన్మయి చెప్పినదానిని బట్టి చూస్తే, ఈ సినిమాలో సస్పెన్స్ .. హారర్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయని అర్థమవుతోంది. అవి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయనే విషయం స్పష్టమవుతోంది. ఈ సినిమాలో పగ తీర్చుకునే దెయ్యం పాత్రలో సమంత కనిపించనుండగా, 'మెంటలిస్ట్' పాత్రను నాగ్ పోషించారు. మరో ముఖ్యమైన పాత్రలో శీరత్ కపూర్ అలరించనుంది. అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది.       
nag
samanta

More Telugu News