Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిర్మాతకు హ్యాండిచ్చి చిక్కుల్లో పడ్డ హీరోయిన్ లావణ్యా త్రిపాఠి!

తమిళంలో రీమేక్ అవుతున్న 100% లవ్

షూటింగ్ కు వెళ్లకుండా నిర్మాతను ఇబ్బంది పెట్టిన లావణ్య

సినీ వాణిజ్య మండలిలో ఫిర్యాదు

తెలుగు చిత్ర ప్రియులకు 'సోగ్గాడే చిన్నినాయనా', 'భలే భలే మగాడివోయ్‌' చిత్రాలతో గుర్తుండిపోయిన లావణ్యా త్రిపాఠి, ఇప్పుడు చిక్కుల్లో పడింది. టాలీవుడ్ లో సూపర్ హిట్టయిన '100% లవ్', తమిళంలో జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా, లావణ్య హీరోయిన్ గా '100% కాదల్'గా చంద్రమౌళి దర్శకత్వంలో నిర్మితమవుతోంది. తమ హీరోయిన్ లావణ్య, తీవ్రంగా ఇబ్బందులు పెడుతోందన్నది దర్శక, నిర్మాతల ఆరోపణ.

చిత్రంలో కొంతభాగం షూటింగ్ ను లండన్ లో జరపాలని భావించిన యూనిట్, మొత్తం ప్లాన్ చేసుకున్న తరువాత, బయలుదేరేముందు లావణ్య హ్యాండిచ్చిందట. దీంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందంటూ దక్షిణ భారత సినీ వాణిజ్య మండలిలో చంద్రమౌళి ఫిర్యాదు చేశారు. లావణ్య బాధ్యతారాహిత్యంతో నష్టపోయామని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ తాజా గొడవ నుంచి లావణ్య ఎలా బయట పడుతుందో మరి!
100% love
lavanya tripathi
100% kadal

More Telugu News