'అక్కా బాగున్నావా?' అంటూ పలకరింపు... ఆపై నిజస్వరూపం చూపించే అభిషేక్ గౌడ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అక్కా బాగున్నావా?' అంటూ పలకరింపు... ఆపై నిజస్వరూపం చూపించే అభిషేక్ గౌడ్!

  • క్లాస్ మేట్స్ ను గుర్తించి టార్గెట్ చేసే కార్పొరేటర్ పుత్రరత్నం
  • ఫోటోలు సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి బెదిరింపులు
  • కేసు తీవ్రతను తగ్గించేందుకు రంగంలోకి పెద్దలు
  • కోర్టు, కేసు వద్దని చెబుతున్న బాధిత కుటుంబాలు
అమ్మాయిలను వేధిస్తున్న కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన టీఆర్ఎస్ కార్పొరేటర్ జగదీశ్‌ గౌడ్‌ కుమారుడు అభిషేక్ గౌడ్ ను విచారిస్తున్న పోలీసులు అతని నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టారు. తనతో పాటు చదివిన అమ్మాయిల ఫోన్ నంబర్లను స్నేహితుల నుంచి సేకరించే అభిషేక్ గౌడ్, ఆపై తనలోని క్రూరత్వాన్ని బయటపెట్టేవాడు.

తొలుత "అక్కా బాగున్నావా?" అని ఆప్యాయంగా పలకరించి, చిన్నప్పుడు కలసి చదువుకున్నామని గుర్తు చేసేవాడు. తాను హోటల్ మేనేజ్ మెంట్ చదువుతున్నానని చెప్పి, ఓసారి కలుద్దామని అడిగేవాడు. "మీరు జీవితంలో ఉన్నతస్థాయికి చేరారని అనుకుంటున్నా" అనేవాడు. ఏవైనా అవసరాలు ఉంటే చేసి పెడతానని నమ్మబలికేవాడు.

తన మాటలు విశ్వసించే అమ్మాయిల ఫోటోలను సోషల్ మీడియా ద్వారా సేకరించి, పోర్న్ స్టార్ గా మార్ఫింగ్ చేసేవాడు. వాటిని తిరిగి బాధితులకు పంపి, రోజూ తనతో మాట్లాడాలని, లేకుంటే ఆ ఫోటోలను అప్ లోడ్ చేస్తానని బెదిరింపులకు దిగేవాడు. తనతో పాటు చదివిన ముగ్గురితో పాటు, మరో పది మందిని ఇలా వేధింపులకు గురి చేశాడు. ఓ డాక్టర్ కుమార్తె, మరో ప్రైవేటు ఉద్యోగి కుమార్తె, చిత్తూరు జిల్లాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మరో యువతి అభిషేక్ గౌడ్ బాధితుల్లో ఉన్నారు.

ఇక తన కుమారుడిని రక్షించుకునేందుకు కార్పొరేటర్ స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. కేసు కోర్టుకు వచ్చే సమయానికి తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న ఆయన, బాధితులపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. అభిషేక్ గౌడ్ పై కేసు పెట్టిన ఓ బాధితురాలి కుటుంబం, ఇప్పుడు తమకు కోర్టులు, కేసులు వద్దని, ఫిర్యాదులు వాపసు తీసుకుంటామని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.
abhishek goud
TRS corporator

More Telugu News