గులాబి రంగులోకి మారిన చైనా మృతసముద్రం!
- చైనాలోని షాంఘ్సి ప్రావిన్స్ లో ఉన్న యెన్ చెంగ్ సాల్ట్ సరస్సు
- పింక్ కలర్ లోకి మారిపోయిన సరస్సు
- డ్యునలీల్లా సెలీనా శైవలాల కారణంగా కలర్ మారిందట
- 50 మిలియన్ల సంవత్సరాల క్రిందట రెండు రంగుల్లో కనిపించింది
- ఈ సముద్రంలో విహరించే అవకాశం కూడా ఉంది
- చైనా టూరిజానికి భారీ ఆదాయం
ఈ సముద్రం సుమారు 50 మిలియన్ల సంవత్సరాల కిందట రెండు రంగులలో కనిపించిందని చెబుతున్నారు. ఈ సముద్రంలో కొంత భాగం పింక్ గా, మరికొంత భాగం నీలిరంగులో కనువిందు చేసి ఆకట్టుకుంటుంది. ఈ సమయంలో ఈ సముద్రంలో విహరించే అవకాశం కూడా ఉండడం విశేషం. దీని ద్వారా చైనా ప్రభుత్వానికి భారీ ఆదాయం కూడా సమకూరుతుందని తెలుస్తోంది. ఈ సముద్రం నుంచి వచ్చే ఉప్పును స్ధానిక పారిశ్రామిక అవసరాలకు వినియోగించడం విశేషం. 4 వేల ఏళ్ల క్రిందటి నుంచి ఈ సముద్రాన్ని చైనీయులు ఉపయోగించుకుంటుండడం విశేషం.