Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జ‌పాన్ ఓపెన్ సూప‌ర్ సిరీస్‌లో క్వార్ట‌ర్స్‌కి చేరుకున్న శ్రీకాంత్‌, ప్ర‌ణ‌య్‌

  • హాంకాంగ్ క్రీడాకారుడు హు యున్‌పై విజ‌యం సాధించిన శ్రీకాంత్‌
  • తైపీ క్రీడాకారుడు సు జెన్ హ‌వ్‌పై విజ‌యం సాధించిన ప్ర‌ణ‌య్‌
  • మిక్స్‌డ్ డ‌బుల్స్‌లో ఓటమి పాలైన భార‌త జ‌ట్టు
జ‌పాన్ ఓపెన్ సూప‌ర్ సిరీస్‌లో భార‌త క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్‌, హెచ్ఎస్ ప్ర‌ణ‌య్‌లు క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌కి చేరుకున్నారు. వ‌ర‌ల్డ్ నెం. 8 ర్యాంకులో ఉన్న శ్రీకాంత్‌, హాంకాంగ్‌కి చెందిన హు యున్‌పై 21-12, 21-11 తేడాతో విజ‌యం సాధించాడు. త‌ర్వాతి మ్యాచ్‌లో ఇటీవ‌ల ప్ర‌పంచ ఛాంపియ‌న్‌గా నిలిచిన డెన్మార్క్ క్రీడాకారుడు విక్ట‌ర్ అక్సెల్స‌న్‌తో శ్రీకాంత్ పోటీ ప‌డ‌నున్నాడు.

మ‌రోవైపు హెచ్ఎస్ ప్ర‌ణ‌య్, తైపీకి చెందిన జెన్ హ‌వ్‌పై 21-16, 23-21 తేడాతో విజ‌యం సాధించాడు. త‌ర్వాతి మ్యాచ్‌లో చైనా క్రీడాకారుడు షి యూకీతో త‌ల‌ప‌డ‌నున్నాడు. ఇక భార‌త్ త‌ర‌ఫున మిక్స్‌డ్ డ‌బుల్స్ లో పోటీ ప‌డుతున్న అశ్విని పొన్న‌ప్ప‌, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి బాగానే ఆడిన‌ప్ప‌టికీ 27-29, 21-16, 12-21 తేడాతో ఇండోనేషియా నాలుగో సీడ్ ప్ర‌వీణ్ జోర్డాన్‌, డెబ్బీ సూశాంటోల జోడీ చేతిలో ఓడిపోయారు. భారీ అంచ‌నాల‌తో బ‌రిలోకి దిగిన పీవీ సింధు, త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి నోజోమీ ఒకుహారా చేతిలో ఓటమి పాలైన సంగ‌తి తెలిసిందే.
japan open super series
srikanth
prannoy
quarters
sindhu

More Telugu News