Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అలనాటి బాలీవుడ్ నటి షకీలా మృతి!

అలనాటి బాలీవుడ్ నటి షకీలా తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 82 సంవత్సరాలు. గుండెపోటుతో ఆమె నిన్ననే కన్నుమూశారు. అయితే, ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు నేడు ప్రకటించారు. రాజ్ కపూర్, షమ్మీ కపూర్, గురుదత్ లాంటి హేమాహేమీలతో కలసి షకీలా నటించారు. ఆలీ బాబా ఔర్ చాలీస్ చోర్, పోస్ట్ బాక్స్ 999, చైనా టైన్, సీఐడీ, ఆర్ పార్ తదితర ఎన్నో హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. షకీలా మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 
shakeela
shakeela died
bollywood

More Telugu News