'శ్రీవల్లీ' ఫ్లాప్ కావడానికి కారణం నేనే!: విజయేంద్ర ప్రసాద్
- 'శ్రీవల్లీ' కథ ఆసక్తికరమైనదే
- నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదు
- ఇంకా బాగా తెరకెక్కించవలసింది
- పరాజయానికి కారణం నేనే
తాజాగా ఈ సినిమా గురించి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ఈ సినిమా కథ ఆసక్తికరమైనదేననీ .. ఆకట్టుకునేదేనని ఆయన అన్నారు. తనని నమ్మి నిర్మాతలు కూడా ఖర్చుకు వెనకాడలేదని చెప్పారు. అయితే తాను సరిగ్గా తెరకెక్కించలేకపోవడం వల్లనే ఈ సినిమా పరాజయాన్ని చవి చూసిందని అన్నారు. మరింత బాగా తాను చిత్రీకరించవలసి ఉండవలసిందని చెప్పారు. ఈ సినిమా ఆదరణ పొందకపోవడానికి తానే కారణమని అంగీకరించారు.