'మహానటి' కోసం నన్నెవరూ సంప్రదించలేదు : ఎన్టీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మహానటి' కోసం నన్నెవరూ సంప్రదించలేదు : ఎన్టీఆర్

  •  షూటింగు దశలో 'మహానటి' 
  •  ఎన్టీరామారావు పాత్రను జూనియర్ ఎన్టీఆర్ చేస్తారనే టాక్
  •  తనని ఎవరూ సంప్రదించలేదన్న ఎన్టీఆర్
  •  ఈ పాత్ర విషయంలో కొనసాగుతోన్న ఆసక్తి
సావిత్రి జీవిత చరిత్రగా 'మహానటి' సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోదావరి జిల్లాల్లో జరుగుతోంది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ .. సావిత్రి భర్త జెమినీ గణేశన్ గా దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. ఎస్వీ రంగారావు పాత్ర కోసం మోహన్ బాబును ఎంపిక చేసుకున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక ఎన్టీ రామారావు పాత్రను జూనియర్ ఎన్టీఆర్ పోషించనున్నాడనే టాక్ చాలాకాలంగా వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది అభిమానులకు కూడా అర్థం కాకుండా పోయింది.

 ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమాలో తాను చేయడం లేదని ఆయన చెప్పాడు. ఈ సినిమాకి సంబంధించిన వారెవరూ ఇంతవరకూ తనని సంప్రదించలేదనీ, ఎన్టీ రామారావు పాత్రను చేయడం అంత తేలికైన విషయం కాదని అన్నాడు. ఒకవేళ సంప్రదిస్తే చేస్తాడా .. లేదా అనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. 
ntr

More Telugu News