నాకు క్రికెట్ అంటే ప్రాణం.. ఫుట్ బాల్ కూడా ఆడేవాడిని: అఖిల్
- హెచ్ఎఫ్ఎల్ బ్రాండ్ అంబాసడర్ గా అఖిల్
- జెర్సీని ఆవిష్కరించిన యంగ్ హీరో
- నవంబర్ 25 నుంచి లీగ్ ప్రారంభం
- యూట్యూబ్ చానల్ లో లైవ్ టెలికాస్ట్
నవంబర్ 25వ తేదీన హెచ్ఎఫ్ఎల్ మూడో సీజన్ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా జెర్సీని అఖిల్ ఆవిష్కరించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆరుగురు ఆటగాళ్లతో నలభై నిమిషాల పాటు జరిగే ఈ లీగ్ లో 12 జట్లు పోటీ పడతాయని చెప్పాడు. మొత్తం పది వారాల పాటు కొనసాగే ఈ లీగ్ లో 135 మ్యాచ్ లు జరుగుతాయని తెలిపాడు. ప్రతి మ్యాచ్ యూట్యూబ్ చానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారమవుతుందని చెప్పాడు.