మరో కీచక బాబా... లా విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన ఫలాహరీ బాబా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరో కీచక బాబా... లా విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన ఫలాహరీ బాబా

  • డేరాబాబా బాటలో మరో బాబా
  • లా చదివిన యువతిపై అత్యాచారయత్నం
  • సోదరుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి
  • అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులు
  • అప్పటికే విషయం తెలిసి ఆసుపత్రిలో చేరిన బాబా
ఇద్దరు సాధ్విలపై అత్యాచారం చేసిన డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్ రోహ్ తక్ జైలులో ఊచలు లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి మరో కీచక బాబా ‘వ్యవహారం’ వెలుగుచూసింది. దాని వివరాల్లోకి వెళ్తే... ఛత్తీస్‌ ఘడ్‌ లోని బిలాస్‌ పూర్‌ కు చెందిన యువతి లా విద్యాభ్యాసం చేసింది. ఇంటర్న్ షిప్ కూడా విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఆనందాన్ని తన బంధువైన ఫలాహరీ బాబాతో పంచుకుందామని అదే పట్టణంలో ఉన్న ఫలాహారీ బాబా దగ్గరకు వెళ్లింది. పూజలో ఉన్న బాబాను కలిసేందుకు అతని గదిలోకి వెళ్లింది.

హారతి కార్యక్రమం పూర్తి కావడంతో గదిలోకి వచ్చిన బాబా, యువతిని చూసి తలుపుగడియ పెట్టి అత్యాచారయత్నం చేశాడు. దీంతో యువతి అవమానభారంతో ఢిల్లీలోని తన సోదరుడి దగ్గరకు చేరుకుని జరిగింది వివరించింది. దీంతో అతను తన సోదరిని తీసుకుని బిలాస్ పూర్ చేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాబాపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు నిమిత్తం బాబా ఆశ్రమానికి వెళ్లారు. అయితే ఆశ్రమంలో ఆయన కనిపించలేదు. అప్పటికే విషయం తెలుసుకున్న బాబా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో ఆసుపత్రికి వెళ్లిన పోలీసులు ఐసీయూలో బాబాను చూసి విచారించకుండా వెనుదిరిగారు. 
phalahari baba
rapist baba
chhattisgarh

More Telugu News