డేరాలో అంతేలేని గుర్మీత్ ఘోరాలు... అమ్మాయిల అక్రమ రవాణా, విచ్చలవిడి వ్యభిచారం కూడా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డేరాలో అంతేలేని గుర్మీత్ ఘోరాలు... అమ్మాయిల అక్రమ రవాణా, విచ్చలవిడి వ్యభిచారం కూడా!

  • సాక్ష్యాలు లభించాయన్న సిట్ అధికారులు
  • విదేశాలకు కూడా అమ్మాయిల రవాణా
  • అవయవాల వ్యాపారం కూడా
  • ఫిర్యాదులు అందుతున్నాయన్న సిట్
హర్యానా, సిర్సా శివార్లలోని డేరా సచ్చా సౌధాలో గుర్మీత్ రామ్ రహీమ్ జరిపిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉండగా, తాజాగా, డేరాలో అమ్మాయిల అక్రమ రవాణా జరిగేదని, విచ్చలవిడి వ్యభిచారం ఇక్కడ సర్వసాధారణమని అధికారులు తేల్చారు. ఇక్కడి నుంచి అమ్మాయిలను విదేశాలకు పంపుతూ ఉండేవారని తమకు సాక్ష్యాలు లభించాయని, వాటిపై విచారణ ప్రారంభించామని తెలిపారు.

 డేరా నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు అమ్మాయిలను పంపి వ్యభిచారం చేయించినట్టు కూడా తెలుస్తోందని అన్నారు. మనుషుల అక్రమ రవాణాతో పాటు అవయవాల వ్యాపారం జరిగినట్టు ఇటీవల వెల్లడించిన పోలీసులు, మరిన్ని రోజుల పాటు సోదాలు నిర్వహిస్తామని చెబుతున్నారు. కనీస సురక్షతలను కూడా పాటించకుండా ఇక్కడ వ్యభిచారం జరిగిందని, ఎంతో మందికి గర్భస్రావాలు జరిగాయని, బాధితులు ఒక్కొక్కరుగా తామనుభవించిన బాధలపై ఫిర్యాదులు చేస్తున్నారని సిట్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఫిర్యాదులన్నింటిపైనా దర్యాఫ్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. తనకు సహకరించే రాజకీయ నాయకులు, ప్రముఖుల కోసం గుర్మీత్ అమ్మాయిలను ఎంచుకుని మరీ పంపించేవాడని సమాచారం.
dera
gurmeet
prostitution

More Telugu News