Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డైలాగ్ టు డైలాగ్ చంద్రబాబుకు చూపించాలి... లేకపోతే వర్మ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది: టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ హెచ్చరిక

  • రాంగోపాల్ వర్మకు టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ హెచ్చరికలు
  • ఎన్టీఆర్ బయోపిక్ తీయాలనుకుంటే చంద్రబాబు అనుమతి తీసుకోవాలి
  • చంద్రబాబును చెడ్డగా చూపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి
  • సినిమా పూర్తయిన తరువాత డైలాగ్ టు డైలాగ్, సీన్ టు సీన్ చూపించాలి
  • తేడాలొస్తే తీవ్రపరిణామాలు ఉంటాయి
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పై బయోపిక్ తీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుమతి తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. రాంగోపాల్ వర్మ బయోపిక్ పై ఆయన మాట్లాడుతూ, సినిమా షూటింగ్ కు ముందు బాబు నుంచి అనుమతి తీసుకున్నట్టే సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత డైలాగ్ టు డైలాగ్ చంద్రబాబునాయుడుకు చూపించాలని తెలిపారు. లేని పక్షంలో సినిమా తీసేశాను, విడుదల చేసేశానంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సినిమా వివాదాస్పదంగా తీస్తే రాంగోపాల్ వర్మ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అయినా రాంగోపాల్ వర్మ సినిమా అంటే తొలుత వివాదం రేపడం, తరువాత తుస్సుమనిపించడం సాధారణమేనని ఆయన తేల్చేశారు. 
ramgopal verma
ntr
ntr movie
rajendra prasd
Telugudesam mlc

More Telugu News